Thursday, May 13, 2021

YSR Rythu Bharosa 2021 Payment Status Check beneficiary list download @ ysrrythubharosa.ap.gov.in

How to check AP YSR Rythu Bharosa Scheme 2021 Payment Status , Check beneficiary list download @ ysrrythubharosa.ap.gov.in
Andhra Pradesh Chief Minister Sri. YS Jagan Mohan Reddy has launched the ambitious  YSR Rythu Bharosa scheme. The program was launched by CM Jagan through video conferencing. The first installment of each farmer's family will be credited with Rs. 7,500 through this scheme.    The first installment under YSR Rythu Bharosa scheme payment amount Rs 7500/- has been transferred to farmers' bank accounts on May 13. Farmers can check payment status online at ysrrythubharosa.ap.gov.in or visit the Bank and Gram Panchayat Office to check the status. And the AP Govt also announced that we will give Rs. 7500 to  tenant farmers, the farmers who are cultivating forest land and assigned lands. Farmers can call the 1902 call center if there is no money transfered to ur account. The list of beneficiaries is now available at www.ysrrythubharosa.ap.gov.in Please log in to the portal to check the status of beneficiary list.     



 కష్టకాలంలో రైతుకు ఆర్థిక భరోసా.. నేడే పెట్టుబడి సాయం
  1. గతేడాది కంటే 79,472 మందికి అదనంగా ప్రయోజనం
  2. గతేడాదితో పోల్చితే అదనంగా 32,083 మంది కౌలుదారులకు లబ్ధి
  3. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌
 కరోనా కష్టకాలంలో ఖరీఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్‌ ప్రారంభం కావడానికి ముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెడుతోంది. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద గురువారం తొలి విడత సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసాకు ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందగా, వీరిలో 1,86,254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగు దారులున్నారు. వీరందరికీ పీఎం కిసాన్‌ కింద రూ.1,010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి.. తొలి విడతగా రూ.3,928.88 కోట్లు జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.


ఈ ఏడాది అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,52,263 మంది ఉండగా (యానాం రైతులతో కలిపి), భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంకు చెందిన 865 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 79,472 రైతు కుటుంబాలు అదనంగా లబ్ధి పొందనున్నాయి. ఈ ఏడాది 32,083 మంది కౌలుదారులు కొత్తగా లబ్ధి పొందనున్నారు. 50,52,263 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద తొలి విడతగా రూ.2 వేల చొప్పున కేంద్రం రూ.1010.45 కోట్లు సర్దుబాటు చేస్తుండగా, రైతు భరోసా కింద రూ.5,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.2,778.74 కోట్లు సాయమందిస్తోంది.

ఇక భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారుల కుటుంబాలకు రూ.7,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తొలి విడతగా రూ.139.69 కోట్లు సర్దుబాటు చేస్తోంది. ఈ విధంగా ఈ ఏడాది కౌలుదారులతో సహా అర్హత పొందిన 52,38,517 రైతు కుటుంబాలకు పీఎం కిసాన్‌ కింద రూ.1010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి వైఎస్సార్‌ రైతు భరోసా–పీఏం కిసాన్‌ కింద తొలివిడతగా రూ.3928.88 కోట్లు నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. గత రెండేళ్లలో రూ.13,101 కోట్లు సాయం అందించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,071.80 కోట్లు అందించనుంది. మొత్తంగా మూడేళ్లలో అన్నదాతలకు రూ.20,172.8 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 

మూడు విడతల్లో సాయం
వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలో రూ.7,500 మే నెలలో, రూ.4 వేలు అక్టోబర్‌లో, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్‌ కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

How to check the YSR Rythu Bharosa Payment Status 2021 online

Step1: first visit YSR Rythu Bharosa official website link given below
Step2. Click on Know Your Payment Status
Step3: A newpage will appear on the screen as Know Your Payment Status
Step4: Enter the Aadhar Number and Captcha code
Step5: Click on submit button
Step6: Now the payment status details of district name, Mandal name, Panchayat name, village name, Farmer’s name, Khata number etc. will be displayed.




పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద 9.5 కోట్ల మంది రైతులకు రూ .20,000 కోట్ల విలువైన 8 వ విడతను పీఎం మోడీ విడుదల చేశారు.
కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా ఇచ్చే డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయో లేవో ఇక్కడ చెక్ చేయండి. 


లబ్ధిదారుల జాబితా ఇప్పుడు www.ysrrythubharosa.ap.gov.in లో లభిస్తుంది. లబ్ధిదారుల జాబితా స్థితిని తనిఖీ చేయడానికి దయచేసి పోర్టల్‌కు లాగిన్ అవ్వండి. వైయస్ఆర్ రైతు భరోసా పథకానికి చెల్లింపు స్థితి ఆన్‌లైన్‌లో  https://ysrrythubharosa.ap.gov.in/RBApp/Reports/PaymentStatus ద్వారా తనిఖీ చేయవచ్చు.

Share this post

Related Posts

AP Latest Updates

    More

Govt Schemes 2021

More

JOBS LATEST

More
Top